FbTelugu

టీటీడీ ఆస్తులపై బీజేపీ నేతల ఉపవాస దీక్షలు

గుంటూరు: టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో ఉపవాస దీక్షలో కూర్చున్నారు.

టీటీడీ ఆస్తులు కాపాడాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ఉపవాస దీక్షలు చేపట్టారు. తన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్.జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీలో హిందూ ధర్మం మనుగడకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. హిందూ దేవాలయాలకు, దేవాలయాల భూములు, ఆస్తుల విషయంలో జోక్యం చేసుకుంటే బీజేపీ చాలా తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన హెచ్చరించారు.

ఏపీలో మతమార్పిడిల విషయంలో, దేవాలయాల భూముల విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుకే వెళ్తున్నదని ఆయన అన్నారు. ఈ అంశాలపై బీజేపీ నిలదీసినప్పుడల్లా  ప్రభుత్వం ఒకడుగు వెనక్కి వేస్తోందని కన్నా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి భూములు, అన్నవరం లో భూములు తీసుకోవాలని ప్రయత్నించగా బీజేపీ వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా టీటీడీ ఆస్తులపై జగన్ ప్రభుత్వం కన్నేసిందని, తనవాళ్లకు కట్టబెట్టేందుకు టీటీడీ జీఓ కూడా ప్రభుత్వం జారీ చేసిందని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

You might also like