FbTelugu

హోం మంత్రి మనవడిపై ర్యాగింగ్ కేసు

హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మనవడు ఫరాన్ పై బాధిత విద్యార్థులు ర్యాగింగ్ కేసు పెట్టారు. బాధిత విద్యార్థి రియాన్ తమను కాపాడాలంటూ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ముఫకం జా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో హోం మంత్రి మనవడు ఫరాన్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. జూనియర్ విద్యార్థులపై తరచూ వేధింపులకు పాల్పడడంతో భరించలేని రియాన్ పంజగుట్ట పోలీసు స్టేషన్ కు వెళ్లారు. తనకు జరుగుతున్న వేధింపులపై పోలీసులకు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.