FbTelugu

నేడు ప్రభుత్వంతో రైతుల కీలక చర్చలు

* 40 వ రోజుకు చేరిన ఉద్యమం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, రైతుసంఘాల నేతలు గత 40 రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. కేంద్రంలో రైతుసంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

తాజాగా ఇవాళ మరోమారు కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. ఇప్పటి వరకు తమ డిమాండ్లపై ప్రభుత్వంతో ఆరుసార్లు చర్చలు జరిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.