FbTelugu

27 నుంచి రైతు బంధు: కేసీఆర్

హైదరాబాద్: డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతుకి సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని కేసీఆర్ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.