FbTelugu

తహశీల్దార్ పై డీజిల్ పోసిన రైతులు

మెదక్: శివ్వంపేట మండలం తహశీల్దార్ భానుప్రకాశ్ పై రైతులు డీజిల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో ఉద్యోగులు అప్రమత్తమై రైతులను చెదరగొట్టారు. రైతులు, రెవెన్యూ ఉద్యోగులు పోటాపోటీగా తోసేసుకున్నారు.

సోమవారం తాళపల్లి తండావాసి బాలు విద్యుదాఘాతంతో చనిపోయాడు. తహశీల్దార్ పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకపోవడం మూలంగానే బాలుకు బీమా సొమ్ము రాలేదని రైతులు కక్ష పెంచుకున్నారు. ఇవాళ తహశీల్దార్ కార్యాలయం వద్దకు మృతదేహంతో వెళ్లి ధర్నా చేశారు. భాను ప్రకాశ్ పై డీజిల్ పోసి రైతులు తమపై కూడా పోసేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఆయనను వారి బారి నుంచి తప్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.