FbTelugu

100 రోజులకు చేరిన రైతు ఉద్యమం

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం వంద రోజులకు చేరింది. వంద రోజులకు చేరుకోవడంతో ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్ల దిగ్బంధానికి రైతు సంఘాల పిలుపునిచ్చాయి.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్ల దిగ్బంధం చేయనున్నారు. వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ హైవే 5 గంటల పాటు దిగ్బంధం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే పదిసార్లు చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మొక్కుబడిగా మాట్లాడి ముగించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.