FbTelugu

వైఎస్సార్ జ‌యంతి రోజున‌ రైతు దినోత్సవం

తాడేపల్లి: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవం గా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్సార్ ముఖ్మ‌మంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని స‌ర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు విప్ల‌వాత్మ‌క‌మైన‌వ‌ని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్ల‌డించింది. రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేసిన దివంగ‌త నేత స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8 వ తేదీని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపింది.

You might also like