FbTelugu

భూములను కాపాడాలంటూ రైతుల ధర్నా

గుంటూరు: తమ పట్టాభూములను ఆక్రమించారంటూ రైతులు ఆందోళనకు దిగిన ఘటన జిల్లాలోని అచ్చంపేట మండలం కోనూరులో చోటుచేసుకుంది. కబ్జాదారులు దళితుల భూములకు నకిలీ పట్టాలు తయారు చేసి ఆక్రమించినట్టుగా వారు ఆరోపిస్తూ ఇవాళ తీవ్ర ఆందోళనకు దిగారు.

ఆ భూముల్లో కబ్జాదారులు ఇసుక తవ్వకాలకు అనుమతి పొందినట్టు తెలిపారు. ఆక్రమణకు గురైన తమ భూములను కాపాడాలంటూ.. రైతులు రోడ్లెక్కారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

You might also like