న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకే ఎక్కువ ప్రయోజనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఫిక్కీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో
మోదీ పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తీసుకువచ్చి నూతన సంస్కరణలతో పెట్టుబడులు అధికంగా వస్తాయన్నారు. అలా పెట్టుబడులు రావడం రైతులకే ఎక్కువ ప్రయోజనమన్నారు. దేశంలో తాము తీసుకుంటున్న చర్యలతో అనేక విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.