న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిన్న చేపట్టిన ట్రాక్టర్స్ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా.. పలు చోట్ల పోలీసులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 3 వందల మంది పోలీసులు గాయపడ్డట్టుగా సమాచారం. ఎర్రకోట వద్ద రైతులు పోలీసులపై దాడి కర్రలతో దాడి చేయడంతో పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు సుమారు 15 అడుగుల గోడపై నుంచి కిందకి దూకారు దీనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: Protestors attacked Police at Red Fort, earlier today. #FarmersProtest pic.twitter.com/LRut8z5KSC
— ANI (@ANI) January 26, 2021