FbTelugu

కొనుగోలు కేంద్రాల రద్దుపై రైతుల ఆగ్రహం

నల్లగొండ: తెలంగాణలో ఇకనుంచి ఐకేపీల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఉండదని, రైతులు బహిరంగ మార్కెట్ లోనే అమ్ముకోవాలంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కేసీఆర్ నిర్ణయం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా రైతులు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల రద్దు రైతుల నడ్డివిరచడమేనంటూ తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేకుంటే దళారులు రైతులను దోచుకుంటారన్నారు. దూరప్రాంతాలకు ధాన్యాన్ని తీసుకెళ్లి అమ్ముకోవడం కష్టసాధ్యమని నిరసన తెలుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.