FbTelugu

రైతులు, రైతుకూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్

తాడేపల్లి: రైతులు, రైతుకూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇవాళ ఏపీలో ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి రైతులకు ఏడాదికి రూ.13,500 సాయం అందించనున్నట్టు తెలిపారు.

తొలివిడతగా రూ.5,500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఆగస్టులో రెండో విడత, సంక్రాంతికి మూడోవిడత సాయం అందిస్తామని తెలిపారు. ఐదేళ్లపాటూ రైతు బరోసా ఇస్తామని తెలిపారు. ఈ ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ.67,500 అందించనున్నట్టు తెలిపారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా రైతులకు సాయం అందిస్తామని తెలిపారు.

You might also like