FbTelugu

రైతుల ఆందోళనకు దిగొచ్చిన కేంద్రం

ఢిల్లీ: రైతుల ఆందోళనలతో కేంద్రం ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఛలో ఢిల్లీ పిలుపు మేరకు ర్యాలీగా వస్తున్న రైతులను ఢిల్లీలోకి అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం  అంగీకరించింది.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నాలుగురాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమం గురువారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం రైతులను అడ్డగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించింది. ఢిల్లీ వైపు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం, బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జీ చేయడంతో ఉద్రిక్తంగా మారింది. అంతే పట్టుదలతో రైతులు ఢిల్లీకి అనుమతించే దాకా వెనుదిరిగేది లేదని స్పష్టం చేశారు.

ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ, డిసెంబర్ 3వ తేదీన చర్చలకు రావాలని, ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా ఢిల్లీ చేరుకునే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. వీరి మొండిపట్టుదలను గమనించిన కేంద్రం ఢిల్లీకి వచ్చేందుకు అనుమతించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.