FbTelugu

మార్కెట్ లో కుప్పకూలిన రైతు

కామారెడ్డి: మార్కెట్ లోనే ఓ రైతు కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషాధ ఘటన జిల్లాలోని బీబీపేట మండలం, యాడారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. దేవరాజు అనే రైతు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తన ధాన్యం తీసుకువచ్చాడు.

ఈ క్రమంలో వర్షం రావడంతో వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకునే యత్నంలో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ మరణంతో కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతుల మరణాల సంఖ్య రెండుకు చేరింది. గత రెండు వారాలుగా అకాల వర్షాలు అపార నష్టాన్ని కలుగజేస్తూ.. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

You might also like