FbTelugu

ప్రగతి భవన్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: శామీర్ పేట్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ సంతోష్ తమ భూమి వివాదంలో అన్యాయం చేస్తున్నాడని భిక్షపతి కుటుంబం ప్రగతి భవన్ ముందు ఒక రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది.
ఒంటి పై కిరోసిన్ చల్లుకుని అంటించుకునే క్రమంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని నీళ్లు చల్లి ఆపారు. ఆ తరువాత వారిని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శామీర్ పేట్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ సంతోష్ వేధింపుల తట్టుకోలేక భిక్షపతి కుటుంబం ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నది. కొత్తూరు గ్రామంలో ఉన్న 1.30 గుంటల భూమిని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని సంతోష్ చూస్తున్నాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ బిక్షపతి, ఆయన భార్య బుచ్చమ్మ లు ఒంటిపై కిరోసిన్ చల్లుకున్నారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు, భద్రతా సిబ్బంది భిక్షపతి పై నీళ్లు పోశారు. భిక్షపతి ని తన భార్య బుచ్చమ్మ ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.