FbTelugu

ఎర్రకోట ముందు కృపాణం తిప్పిన రైతు అరెస్టు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట ముందు కృపాణం (కత్తులు) తిప్పిన రైతు మనీందర్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
సిక్కు మత సంప్రదాయం ప్రకారం కత్తులు వెంట తీసుకువెళ్లడంతో పాటు వాటిని బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించవచ్చు.

రైతులకు మద్దతుగా ఎర్రకోట ముందు మనీందర్ సింగ్ కత్తులతో వీన్యాసాలు చేశాడు. ఢిల్లీ పోలీసు చట్టం సీఆర్పీసీలోని 41.1 నిబంధన ప్రకారం కేసు పెట్టారు. మంగళవారం రాత్రి పీతంపురలోని సీబీ బ్లాక్ బస్టాప్ వద్ద మనీందర్ ను అదుపులోకి తీసుకున్నారు. స్వరూప్ నగర్ లోని అతని నివాసం నుంచి రెండు నాలుగు అడుగుల కృపాణాలను స్వాధీనం చేసుకున్నారు. మనీందర్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.