FbTelugu

యువ గాయకుడిపై మద్యం బాటిళ్లు

హైదరాబాద్: ప్రముఖ యువ గాయకుడు సిద్ శ్రీరామ్ కు హైదరాబాద్ నగరంలో తీవ్రమైన అవమానం జరిగింది. తనపై మద్యం బాటిళ్లు, మంచినీళ్ల బాటిళ్లు విసరడంతో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు.

జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 10 లో సన్ బర్న్ పబ్ లో ఈ నెల 6న శ్రీరామ్ తో లైవ్ షో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాటలు పాడుతుండగా మద్యలో కొందరు ప్రేక్షకులు తొలుత నీళ్ల బాటిళ్లు విసిరారు. ఆ తరువాత మరికొందరు ఏకంగా మద్యం బాటిళ్లనే విసరడంతో శ్రీరామ్ హతాశుడయ్యాడు. ఇదేం పద్దతంటూ నిర్వాహాకులను నిలదీశాడు. ఇలాగైతే కుదరదని తేల్చి చెప్పినా ప్రేక్షకుల అల్లరి మాత్రం ఆగలేదు. ఈ ఘటనను ఒక అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
సిద్ శ్రీరామ్ కు జరిగిన అవమానంపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని, అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జుబ్లిహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ పబ్ లో 800 మందికి మాత్రమే అనుమతి ఉండగా ఆ రోజు 1500 టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆ షో కు వెళ్లిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించలేదని వారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.