FbTelugu

నా మీద అసత్య ప్రచారం: యాంకర్ ప్రదీప్

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా యాంకర్ ప్రదీప్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం పై ప్రదీప్ వివరణ ఇచ్చారు.

తనపై 143 మంది అత్యాచారం చేశారంటూ ఒక యువతి పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రదీప్ స్పందించారు. కొందరు తనను కావాలని లక్ష్యంగా చేసుకుని వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంతో మానసికంగా ఎంతో కుంగుబాటుకు లోనయ్యానని, మా కుటుంబం కూడా మనోవేదన చెందుతోందని తెలిపాడు.

సున్నిత మైన వివాదంలో తన పేరు పెట్టి దాడి చేస్తున్నారు. ఆ యువతి తన పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మమ్మల్ని మానసికంగా మానభంగం చేస్తున్నారని, బాధితురాలికి న్యాయం జరగాలన్నారు. కాని నిజాలు తెలుసుకోకుండా నన్ను లక్ష్యం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నా పేరు వాడటం ఒక అలవాటుగా మారిందన్నారు.
ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదు. నిజాలు బయటకు రావాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందేనని ప్రదీప్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.