FbTelugu

ధరణిలో తప్పుడు వివరాలిస్తే క్రిమినల్ కేసులే

హైదరాబాద్: దసరా నుంచి వ్యవసాయ భుములను తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయేతర ఆస్తులను సబ్ రిజిస్ట్రార్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.
ఇకనుంచి చట్ట విరుద్దంగా చేసే రిజిస్ట్రేషన్లను నిలిపివేసేందుకే సీఎం కేసీఆర్ ఈ విధానాన్ని ప్రారంభించబోతున్నానని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ గురించి ప్రతి వార్డులో, ప్రతి మున్సిపాలిటీలో పోస్టర్లు వేయాలని, ఎల్.ఆర్.యూ.పి చేయడానికి ముఖ్యమైన సలహాలు ముఖ్యమంత్రి ఇచ్చారని ఆయన అన్నారు. ఈ రోజు ధరణి పోర్టల్ పై అన్ని జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా, వ్యవ‌సాయ భూముల‌ మాదిరిగానే.. గ్రామాల్లోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ్రదత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. తెలంగాణలో పట్టాదారు పాసుపుస్తకాలు ఎలా ఇచ్చామో అదే విధంగా ధరణి పోర్టల్ లో ప్రతి ఒక్కటి రికార్డ్ చేయబడుతుందని ఫోటోలు, సంతకాలు, వేలిముద్రలతో సహా రికార్డు చేయాలని తహశీల్దార్లను ఆయన ఆదేశించారు.
పోర్టల్ ను తహశీల్దార్లు, నాయబ్ తహశిల్దార్లు మాత్రమే నిర్వహించాలన్నారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాలలో కంప్యూటర్లు, సీసీటీవీ లు, కెమెరాలు, స్కానర్లు, ప్రింటర్లు, కలర్ ప్రింటర్లు, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అన్ని అందుబాటులో ఉన్నాయని అన్నారు. సోమవారంలోపు కనీసం 10 కేసులైనా అప్ లోడ్ చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దసరా నుంచి దాన్ని ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

గ్రామంలో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు ఇతర భూముల వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలన్నారు. ఆస్తులకు సంబంధించిన యజమాని వివరాలు, ఫొటోను అప్ లోడ్ చేయాలన్నారు. ఈ పోర్టల్‌లో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు అని రెండు రకాలున్నాయి. వ్యవసాయ భూములను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో తహశీల్దార్లు రిజిస్ట్రేషన్లు చేసేలా వ్యవసాయ భూములకు ప్రత్యేక విండో ఉందని, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ విధానంలో భాగంగా ప్రజలు అగ్రికల్చర్ ఫోల్డర్‌లో లాగిన్ అవ్వాలని, ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు
స్లాట్ బుకింగ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ దస్తావేజులో వివరాలు ఎంటర్ చెయ్యాలని, రిజిస్ట్రేషన్‌ ఇదే మొదటి మెట్టని భూమికి చెందిన స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని అయన తెలిపారు. ఈ-ఛలాన్ వస్తుందని, అది రాగానే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలో టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని, ఇందుకు రైతులు తమ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుందని, దాన్ని ఎంటర్ చేశాక, అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుందని అన్నారు. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ సాక్షుల వివరాల్ని ఎంటర్ చేస్తారని సోమేష్ కుమార్ అన్నారు.
వెంటనే భూమి కొనుగోలు దారుడు, భూమి అమ్మకందారుడు, సాక్షుల ఫొటోలు, బయోమెట్రిక్ వివరాలతో పని పూర్తి చేస్తారని, డేటా ఎంట్రీ ఆపరేటర్లే ఈ ప్రక్రియను పూర్తి చేసి, డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తారని అన్నారు. వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్లు నిర్దేశిత సమయంలో ఉండనున్నాయని, అలాగే ఇళ్లు, ప్లాట్లు, పట్టణ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేస్తారని, దసరా నుంచి భూ రికార్డులన్నీ ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్ విధానంలో జరగనున్నాయని, ఎవరైనా తప్పుడు వివరాలు ఇస్తే, క్రిమినల్ చర్యలు ఉంటాయని సోమేష్ కుమార్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.