FbTelugu

పడిపోయిన తిరుమల హుండీ ఆదాయం

తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెనకంజ వేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో బెంబేలెత్తిపోతున్నారు. దర్శనానికి వెళ్తే కరోనా అంటుకుంటుందనే భయంతో దర్శనాలు అమాంతం పడిపోయాయి.

మంగళవారం నాడు నాలుగువేల లోపు భక్తులు మాత్రమే దర్శించుకోగా, రూ.22 లక్షల హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది లాక్ డౌన్ తరువాత ప్రతి రోజు రూ.1 కోటి పైగానే హుండీ ఆదాయం రాగా, 50వేలకు పైగా భక్తులు దర్శించుకునేవారు. కాని ఈసారి తల్లకిందులు అయ్యింది. సెకండ్ ప్రభావం తీవ్రత తిరుమలలో స్పష్టంగా కన్పిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.