FbTelugu

ఫేక్ న్యూస్ పంజా.. రిటైర్డ్ మేజర్ పై క్రిమినల్ కేసు

హైదరాబాద్: ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు ఓ రిటైర్డ్ మేజర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ది స్కిన్ డాక్టర్ పేరుతో ట్విట్టర్ లో ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన రిటైర్డ్ మేజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. రిటైర్డ్ మేజర్ నీలంసింగ్ ఆరంజ్ ఫ్రూట్స్ ను సైబరాబాద్ పోలీసులు బ్యాన్ చేసినట్టుగా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేశాడు.

పాత న్యూస్ పేపర్ ను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకు ఫేక్ పోస్టులను పెడుతున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో రిటైర్డ్ మేజర్ నీలంసింగ్ పై క్రిమినల్ కేసు నమోదుచేసినట్టు తెలిపారు.

You might also like