FbTelugu

నకిలీ ఐపీఎస్ లీలలు ఎన్నోన్నో…

హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణి అంటూ కట్టు కథలు చెప్పి ఒక మైనింగ్ వ్యాపారి వీరారెడ్డి (36) బురిడీ కొట్టించి రూ.11.5 కోట్లు నొక్కేసిన మహిళ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

వీరారెడ్డి కేసు పెట్టడంతో బాచుపల్లి పోలీసులు నకిలీ ఐపీఎస్ అధికారి శృతి సిన్హాతో పాటు ఆమె అనుచరులను అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఆమె బాధితులు పుట్టలోంచి వచ్చినట్లుగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఆమె బారిన పడిన పలువురు బాధితులు పోలీసు అధికారులను కలిసి తమకు జరిగిన మోసాన్ని వెళ్లబోసుకుంటున్నారు. వీరారెడ్డిని మోసం చేసినట్లుగానే తమను కూడా నిండా ముంచిందని పోలీసు అధికారుల ముందు వాపోయారు.

డబ్బుల పంపకంలో బేధాభిప్రాయాలు రావడం, వేరే వ్యక్తులతో శృతి సన్నిహితంగా మెలగడంతో ప్రియుడు విజయ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 5న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన తరువాత అతని సెల్ ఫోన్ ను తండ్రి పరిశీలించగా ఈమె లీలలు వెలుగులోకి వచ్చాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించి వివరాలు అందచేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన తరువాత బాచుపల్లి పోలీసులు శృతి సిన్హాపై నిఘా పెంచి, నిర్థారణ కావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. వీరా రెడ్డి నుంచి డబ్బులు లాగింది వాస్తవమేనని, ఐపీఎస్ అధికారిణి అని నమ్మి డబ్బులు ముట్టచెప్పాడని తెలిపింది. అతని నుంచి రూ.5.5 కోట్లు బ్యాంకుల ద్వారా తీసుకోగా, మిగతాది నగదు రూపం లో తీసుకున్నామన్నారు. ఈ కేసులో రాఘవ రెడ్డి, రణధీర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి  నిందితులను అదుపులోకి తీసుకోగా, అభిషేక్ రెడ్డి పరారీలో ఉన్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.