FbTelugu

‘నకిలీ గ్రాడ్యుయేట్’ అరెస్ట్

ఖమ్మం: మదిగొండ మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఓ నకిలీ గ్రాడ్యుయేట్‌ వచ్చి దొరికిపోయాడు.
పోలీసుల కథనం మేరకు… ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ముదిగొండలోని జడ్పీ పాఠశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి ఓ యువకుడు కేంద్రానికి వచ్చాడు. పోలీసులు ఓటర్‌ స్లిప్‌ అడుగగా స్లిప్‌ చూపించాడు.

అనుమానం వచ్చిన సీఐ అంజలి తనదైన శైలిలో విచారించింది. తన పేరు సతీశ్‌కుమార్‌ అని, తాను 10వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు వెల్లడించాడు. గోకినేపల్లికి చెందిన ఓ వ్యక్తి తనను ఓటు వేయమని చెప్పాడని తెలిపాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.