FbTelugu

నకిలీ మందుల ముఠా అరెస్టు

విజయవాడ: నకిలీ క్రిమిసంహారక మందుల విక్రయ ముఠా గుట్టు రట్టు అయ్యింది. సింజెంటా సంస్థకు నకిలీ మందులను విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు కేంద్రంగా ముఠా ప్యాకింగ్ చేసి రైతులకు విక్రయిస్తున్ననట్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన రాము గుంటూరులోని సింజెంటా సంస్థలో గుమస్తాగానూ, అతడి సోదరుడు మూర్తి అదే సంస్థలో గోడౌన్ మేనేజరుగా పనిచేస్తున్నాడని ఆయన మీడియాకు వివరించారు.

గుంటూరులోని ఫార్చ్యున్ హోమ్ కేర్ ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ కంపెనీ కేంద్రంగా నకిలీ ఉత్పత్తుల ప్యాకింగ్ జరుగుతోందన్నారు. రూ.4.5 కోట్లు విలువైన నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నకిలీ మందులను రైతులకు విక్రయించడంతో పాటు, సింజెంటా సంస్థకు చెందిన కాలం చెల్లిన ఉత్పత్తులను సైతం విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. హైదరాబాద్ నుండి మెటీరియల్ తీసుకొచ్చి సింజెంటా ఉత్పత్తుల పేరుతో నకిలీ మందుల చలామణి చేస్తున్నారని కమిషనర్ శ్రీనివాసులు వివరించారు.

You might also like