FbTelugu

కరోనా రోగుల మధ్య నకిలీ డాక్టర్

విజయవాడ: కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ ఓ నకిలీ డాక్టర్ హల్ చేసిన ఘటన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ.. డాక్టర్ శైలజ పేరుతో పీపీఈ కిట్ ధరించి కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ కరోనా రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది.

ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగలోకి దిగిన పోలీసులు నకిలీ డాక్టర్, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై గతంలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

You might also like