FbTelugu

ఫడ్నవిస్ రాజీనామా

Fadnavis-resigns

ముంబై: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్నిఆయన శుక్రవారం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. ఫడ్నవిస్ ప్రభుత్వ పదవీకాలం ఈ రోజుతో పూర్తి కావడంతో పదవికి ఆయన రాజీనామా చేశారు. మధ్యాహ్నం ఫడ్నవిస్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలసి రాజీనామా పత్రం సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో తనకు సహకరించిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ-శివసేన కూటమిని ప్రజలు మరోసారి ఎన్నుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

You might also like