FbTelugu

సోషల్ మీడియా అబద్దపు ప్రచారాలపై నిఘా…

విజయవాడ: సోషల్‌ మీడియాలో దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని చెక్ పెట్టేందుకు ‘ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్, ట్విట్టర్‌ అకౌంట్ ను ఏపీ పోలీస్ ప్రారంభించిందని ఏపి టెక్నికల్ సర్విస్ ఇంచార్జీ డీఐజీ పాల్ రాజ్ తెలిపారు.
ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్, ట్విట్టర్‌ ద్వారా ఎవరు తప్పుడు పోస్టింగ్ పెట్టినా ఇట్టే పసికడుతుందన్నారు. మీడియాలో, సోషల్‌మీడియాలో మహిళల గురించి తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదు అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్, కోసం సిబ్బందిని తీసుకుంటున్నామన్నారు. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న వాటిపై నిఘా పెట్టి, నిజాలను బయట పెడుతుందని పాల్ రాజ్ వివరించారు. ఏపీలోని ప్రతి జిల్లా లో ప్రతి డిపార్ట్ మెంట్ లో ఫ్యాక్ట్ చెక్ సిబ్బంది ఉంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రతి జిల్లా లో పదిమంది చొప్పున సిబ్బందిని తీసుకుంటున్నామని.. వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తామని డీఐజీ పాల్ రాజ్ అన్నారు.

సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం చేస్తున్న వారి పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పార్టీ ల పరంగా… ఇతరుల పై ఇష్టానుసారంగా వ్యవహరిస్తే శిక్షపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకు వచ్చిందని వివరించారు. దానికి అనుగుణంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో సభ్యులు, ఇతర గ్రూపు సభ్యులు పోస్టింగ్ పెట్టే ముందు గ్రూపు అడ్మిన్ జాగ్రత్త వ్యవహరించాలని పాల్ రాజ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.