FbTelugu

బీజేపీ భజనపై స్పందించిన ఫేస్ బుక్

రాజకీయాలు, నేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ స్పందించింది. ఏ పార్టీతో సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత సమాచార వ్యాప్తిని తాము నిషేధించామని ప్రకటించింది.
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించింది. కఠిన నిబంధన అమలులో పురోగతి సాధిస్తున్నామని, కచ్చితత్వాన్ని నిర్థారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నట్లు పేస్ బుక్ వెల్లడించింది.

ఇండియాలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఫేస్ బుక్ ఆ పార్టీ నేతలు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం వెలువరించిన విషయం తెలిసిందే. ఈ అక్రమ బంధంపై కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్, అనుబంధ సంఘాలు విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ ఆరోపణలు గుప్తించారు.

రాహుల్ వ్యాఖ్యలతో ఫేస్ బుక్ యాజమాన్యం స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని ఈ ఆరోపణలు నిజమని కాని అబద్దమని కాని ఎక్కడా పేర్కొనకుండా కప్పదాటు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. రాహుల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. పౌరుల హక్కులు పరిరక్షించడం కోసం సోషల్ మీడియా, ఆన్ లైన్ న్యూస్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల దుర్వినియోగాన్ని అరికడతామని శశిథరూర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సాక్ష్యాధారాలను సేకరిస్తామని ఆయన తెలిపారు.

You might also like