FbTelugu

నా ప్రాణానికి రక్షణ లేదు: ఫేస్ బుక్ డైరెక్టర్

ఢిల్లీ: అమెరికా పత్రిక ప్రచురించిన వార్త రాజకీయ దుమారం లేపుతోంది. ఫేస్ బుక్ ను ఆర్ఎస్ఎస్, బీజేపీ లు నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఘాటైన విమర్శలు చేయడంతో వివాదంగా మారింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంతో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ సంచలన ఆరోపణలు చేసింది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. రాజకీయ విమర్శల నేపథ్యంలో తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వాపోయింది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టుల విషయంలో ఫేస్ బుక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కర్నాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో కరోనా జిహాద్ అంటూ ఒక వర్గానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ట్విట్టర్ తొలగించింది కాని ఫేస్ బుక్ మాత్రం తొలగించలేదు. ఇలా ఎన్నో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల పోస్టుల పట్ల చూసిచూడనట్లు వ్యవహరించిందనేది వాల్ స్ట్రీట్ జర్నల్ తేటతెల్లం చేసింది.

ఫేస్ బుక్ చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ పట్ల డైరెక్టర్ అంకిదాస్ కు ఉన్న భయమేనని వ్యాఖ్యానించింది.

You might also like