FbTelugu

అయోధ్యపై ఫేస్ బుక్ లో పోస్టు… అరెస్టు

Facebook-post-on-Ayodhya--arrested

ముంబై: అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తున్న కీలక సమయంలో మహారాష్ట్రలోని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారు. ధూలె జిల్లాలోని ఓల్డ్ ఆగ్రా రోడ్డు నివాసి తన ఫేస్ బుక్ ఖాతాలో అయోధ్యపై పిచ్చి రాతలతో పోస్టు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ పోస్టు ను పరిశీలించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.

You might also like