FbTelugu

కేంద్రం దెబ్బకు ఫేస్ బుక్ దిద్దుబాటు చర్యలు

డిజిటల్ సమాచారం వ్యాప్తిపై కేంద్రపభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావడంతో సోషల్ మీడియా సంస్థలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. ఒక్క ట్విటర్ మినహా మిగతా సంస్థలు ఇండియా చట్టాలను గౌరవిస్తామని, అమలు చేస్తామని ప్రకటించాయి.

తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఫేస్ బుక్ లో వ్యాప్తి చేసే వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోయింది. నియంత్రణ లేకపోవడం, సమాచారాన్ని తనిఖీ చేసే వ్యవస్థ లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారిందనే చెప్పాలి. తప్పుడు వార్తలు లేదా సమాచారాన్ని ఉంచేవారిపై గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. కరోనా 19 వ్యాక్సిన్లు, ఎన్నికలు, ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అదే పనిగా తప్పుడు సమాచారం తయారు చేసి పెడుతున్నవారు, వాటిని షేర్ చేస్తున్నవారిపై ఫేస్ బుక్ కన్నేయనున్నది.

ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు ఫ్యాక్ట్ చెకింగ్ భాగస్వాములతో కలిసి పనిచేయనున్నది. తరచూ ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులకు నోటీసులు పంపిస్తుంది. దీంతో పాటు వారి పెడుతున్న పోస్టులు కన్పించకుండా చర్యలు చేపడుతుంది. తప్పుడు వార్తలు లేదా సమాచారం లేదా వీడియోల చుట్టూ రీ డిజైనింగ్ చేసి, సులువుగా గుర్తు పట్టేలా చేస్తుంది. దాన్ని చూడగానే ఇది తప్పుడు వార్త అనేది ఖాతాదారులకు తెలిసిపోతుంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న తప్పుడు వార్తల నుంచి అభాసుపాలు కాకుండా ఫేస్ బుక్ నడుం బిగించింది. ఈ నిర్ణయం మూలంగా వాస్తవంగా వార్తలు షేర్ చేసేవారికి ఊరట లభించనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.