FbTelugu

జుకర్ బర్గ్ జాతకం లీక్…

కాలిఫోర్నియా: డేటా లీకేజీపై ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా గొడవలు, కేసులు నడుస్తుండగానే మరోవైపు ఏదో ఒక రూపంలో లీక్ అవుతునే ఉన్నాయి. తాజాగా ఫేస్ బుక్ సీఈఒ మార్క్ జుకర్ బర్గ్ నెంబర్ లీక్ అయ్యింది.

విచిత్రం ఏమంటే ఆయనకు సిగ్నల్ యాప్ లో ఖాతా ఉందని, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆన్ లైన్ లో పెట్టారని హ్యాకింగ్ భద్రతా పరిశోధకుడు ఒకరు వెల్లడించడం విశేషం. ఇదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉణ్న 533 మిలియన్ల ఫేస్ బుక్ ఖాతాదారు వ్యక్తిగత వివరాలు లీకేజీకి గురైనట్లు తెలిపారు. ఇందులో 60 లక్షల మంది ఇండియన్లు ఉండగా యూఎస్ కు చెందిన వారు 32 మిలియన్లు ఉన్నారు. ఈ నెంబర్లకు సంబంధించిన వివరాలు డేటాబేస్ హాక్టర్ల ఫోరంలో పోస్టు చేసేశారు. బాధితుల్లో ఫేస్ బుక్ సహా వ్యవస్థాపకులు డస్టిన్ మొస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్ కూడా ఉండడం కలవరపరిచే అంశం.

సైబర్ ఎక్స్ పర్ట్ డేవ్ వాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం జుకర్ పేరు, ఫేస్ బుక్ యూజర్ ఐడి, జన్మస్థలం, చదువుల, వివాహం, స్నేహితుల వివరాలు లీకేజి అవ్వడం ఫేస్ బుక్ పెద్దలను నిద్రలేకుండా చేస్తున్నది. లీకైన్ ఫోన్ నెంబర్ స్క్రీన్ షాట్ తో పాటు ఆయనకు సిగ్నల్ యాప్ లో అక్కౌంట్ ఉందంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.