FbTelugu

చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

ఇరువైపులా భారీగా మోహరించిన బలగాలు

ఢిల్లీ: చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

కొద్ది గంటలుగా ఇండియా, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. చైనా వైపు వేయి మందికి పైగా, ఇండియా వైపు వేయి మందికి తక్కువ కాకుండా మొహరించినట్లు వార్తలొస్తున్నాయి. కీలక ప్రాంతాల్లో ఎవరికి వారుగా యుద్ద ట్యాంకులు, ఫిరంగలను సిద్ధం చేసుకుంటూ సై అంటే సై అనే విధంగా ఉన్నాయి.

చైనా నుంచి ఏ విధమైన దాడులు జరిగినా ధీటుగా ఎదుర్కొవాలని ఇండియా నిర్ణయించింది. పాంగాంగ్ టీఎస్ఓ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్ ఆపరేషన్ చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ ప్రాంతంలో చైనా భారీగా సైనిక దళాలను మోహరిస్తున్నది. అంతే స్థాయిలో ఇండియా కూడా సైన్యాన్ని మోహరింపచేస్తున్నది.

You might also like