FbTelugu

ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

* ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నం
హైదరాబాద్: నగరంలో నూతన పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ కార్పొరేటర్లు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించడంతో ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు, కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తాము గెలిచి నెల రోజులు అవుతున్నా తమకి ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచామన్నారు. ప్రజలకి తాము ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అసలు తమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. మేము ఎమన్నా రౌడీలమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.