FbTelugu

ఓవైసీకి డీఎంకే ఆహ్వానం పట్ల తీవ్ర అసంతృప్తి

* చివరకు వెనక్కి తగ్గిన డీఎంకే
చెన్నై: ఈ నెల 06న తమిళనాడులోని చెన్నైలో ప్రతిపక్ష డీఎంకే నిర్వహించనున్న మహానాడుకు.. ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని డీఎంకే మైనారిటీ సంక్షేమ విభాగం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఆహ్వానించడం పట్ల రాష్ట్రంలోని ఇతర ఇస్లామిక్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అసదుద్దీన్ బీహార్ లో పోటీ చేయడంతో అక్కడ

ప్రతిపక్షాల ఓట్లు చీలి బీజేపీ గెలవడానికి కారణమైందని వారు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ఒవైసీని మహానాడుకు ఆహ్వానించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓవైసీతో పొత్తు పెట్టుకున్నా డీఎంకేకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండబోదని తెలుపుతున్నారు. ఈ తరుణంలో డీఎంకే స్పందించింది. కూటమి పార్టీలను మాత్రమే మహానాడుకు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.