FbTelugu

వివాహేతర బంధం.. బండరాయితో కొట్టి హత్య

నిర్మల్: ఓ యువకుడిని బండరాయితో మోది హత్య చేసిన ఘటన జిల్లాలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషోర్ అనే యువకున్ని బాబు(నిందితుడు) అనే వ్యక్తి అతి దారుణంగా

బండరాయితో మోది హత్య చేశారు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా.. మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like