FbTelugu

వివాహేతర బంధం.. నడిరోడ్డుపై హత్య!

తూర్పుగోదావరి: ఓ యువకుడిని నడిరోడ్డుపై అతిదారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని కాకినాడ ప్రతాప్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని ప్రతాప్ నగర్ లో ఓ యువకున్ని కొందరు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా ఓ బలమైన ఆయుధంతో తలపై గట్టిగా కొట్టి హతమార్చారు.

ఓ మహిళతో వివాహేతర బంధం, వేదింపులే హత్యకు కారణంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువతి తండ్రే యువకుని హత్యకు సూత్రదారి అని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ భీమారావ్ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.