FbTelugu

వాహన డాక్యుమెంట్ల చెల్లుబాటు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీ: దేశంలో వాహనాల ఫిట్ నెస్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో సహా ఇతర వాహన సంబంధిత డాక్యుమెంట్ల చెల్లుబాటును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా పలువురు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. దీంతో వాహనానికి సంబంధించిన పలు డాక్యుమెంట్ల గడువు కాలం ముగిసింది. దీనిపై పెద్ద ఎత్తున వినతులు రావడంతో గడ్కరీ స్పందించారు. గత ఫిబ్రవరిలో గడువు ముగిసిన వారికి జూన్ వరకు గడువు ఇచ్చింది. కేసులు మరింతగా పెరగుతుండడంతో ఆ గడువును సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది.

You might also like