FbTelugu

ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేది పొడిగింపు

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీని 2021 ఫిబ్రవరి 28కి పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా స్థంభించిన కార్యక్రమాలన్నీ ఇంకా గాడిలో పడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పన్ను చెల్లింపుదారులంతా ప్రతీ సంవత్సరం నిర్ధేశించిన నిర్ణీత గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తుంటారు. ప్రతీ ఏటా ఈ ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీ జూలై 31గా ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ తేదీని డిసెంబర్ 31, 2020కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా మహమ్మారి నుంచి విముక్తి లభించకపోవడంతో  తాజాగా ఈ గడువును మరోసారి పెంచారు. ఐటీ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చివరి తేదీని 2021 ఫిబ్రవరి 28కి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.