FbTelugu

చాటింపు… వ్యాక్సిన్ వేసుకోకపోతే బహిష్కరణ

భోపాల్: అందరూ కరోనా బారి నుంచి బయటపడేందుకు 13 గ్రామాల ప్రజలు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, తీసుకోకుండా తప్పించుకునేవారిని గ్రామ బహిష్కరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

నాలుగు గ్రామ పంచాయతీల పరిధఇలో 13 గ్రామాలు ఉన్నాయి. వైరస్ నుంచి విముక్తి లభించాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్ని గ్రామాల సర్పంచ్ లు నిర్ణయించారు. వ్యాక్సిన్ వేయించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారి పట్ల కఠినంగా ఉండనున్నారు. వారిని గ్రామ బహిష్కరణ విధించనున్నట్లు ప్రకటించారు. వారి ఇంటికి ఎవరూ వెళ్లకుండా ఉండడం, వారిని కూడా గ్రామంలో పిలువకుండా దూరం పెట్టాలని సర్పంచ్ లు తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రతిబాద్, సర్వార్, సికింద్రాబాద్, ముండ్ల పంచాయతీ పరిధిలోని సర్పంచ్ లు తీసుకున్నారు. ఈ గ్రామాల పరిధిలో జనాభా సుమారు 15వేల వరకు ఉండగా, వీరిలో 5 వేల మందికి పైగా ఇప్పటికే తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.