FbTelugu

రైలుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Express-train-narrowly-missed

శ్రీకాకుళం: రైలు పట్టా విరిగిపోవడంతో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన జిల్లాలోని జలుమూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మండలంలోని తిలారు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. ఈ విషయాన్ని రైలు లోకో పైలట్‌ గుర్తించాడు. అప్పటికే ఇంజిన్‌తోపాటు మూడు బోగీలు కూడా విరిగిన పట్టాలపై నుంచి వెళ్లిపోయాయి. అయినా లోకో పైలట్‌ చాకచక్యంగా రైలును నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

You might also like