ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కలకలం రేపుతున్నాయి. ఆయన నివాసం వద్ద వద్ద పేలుడు పదార్థాలు ఉన్న కారును వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించారు.
ఆయన ఇంటికి సమీపంలో ఒక వాహనం చాలా సమయం నుంచి పార్క్ చేసి ఉంది. చాలా సమయం నుంచి కదలకుండా అక్కడే పార్క్ చేసి ఉండడంతో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఆ వాహనంలో పేలుడు పదార్థాల మాదిరి కన్పించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో అక్కడకు చేరుకుని తనిఖీలు చేశారు. ఆ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, ఎంత సమయం నుంచి పార్కింగ్ చేసి ఉందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.