FbTelugu

చెత్త కుప్పలో పేలుడు.. మహిళకు తీవ్ర గాయాలు

Explosion-in-garbage-heap--serious-injuries-to-woman

హైదరాబాద్: ఓ మహిళ చెత్త ఏరుకుంటుండగా చెత్తలో భారీ పేలుడు సంభవించి మహిళకు తీవ్ర గాయాలైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. చెత్తను ఏరుకునే ఓ మహిళ చెత్తను ఏరుకునే క్రమంలో ఓ డబ్బా కనిపించగా దాన్ని ఆమె పగులకొట్టి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ.. ఆ డబ్బాను నేలకేసి కొట్టడంతో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఆ అమాయక మహిళకు తీవ్ర గాయాలైనాయి. కాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like