FbTelugu

పేలిన మొబైల్… ముగ్గురు మృతి

చెన్నై: ఛార్జింగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కరూర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకున్నది.

ముత్తులక్ష్మీ (29) అనే మహిళ తన మొబైల్ కు ఛార్జింగ్ పెటింది. ఎవరో ఫోన్ చేయడంతో అలాగే ఎత్తి మాట్లాడింది. కాల్ కట్ చేసిన తరువాత పెద్ద శబ్ధంతో ఫోన్ పేలి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ముత్తులక్ష్మీ శరీరం కాలిపోగా, పక్కనున్న ఆమె పిల్లకు కూడా అంటుకున్నది. చిన్నారులు రంజిత్ (3), దీక్షిత్ (2) తీవ్రంగా గాయపడ్డంతో ముగ్గురుని ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి చేరుకునే లోపే వారు ప్రాణాలు వదిలారు. ముత్తు లక్ష్మీ ఆమె భర్త బాలకృష్ణ కరూర్ లో ఫుడ్ స్టాల్ నడుపుతున్నారు. లాక్ డౌన్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలకృష్ణ ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. ఇద్దరి పిల్లలతో ఆమె ఇంటి పట్టునే ఉంటోంది.

You might also like