FbTelugu

పేలిన ఎల్.పి.జి సిలిండర్… 12 మంది మృతి

హాంకాంగ్: షియాన్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించగా 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 138 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్య చైనా నగరంలోని హఉబీ ప్రాన్స్ లోని షియాన్ లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఒక భవనంలో ఎల్.పి.జి సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి భవనం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం తెలుసుకున్న వెంటనే అగ్ని మాపక, పోలీసు సిబ్బంది చేరుకుని శిథిలా కింద చిక్కకున్న 150 మందిని ప్రాణాలతో రక్షించారు. మిగిలి వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతం రోదనలు, పెడబొబ్బలతో దద్దరిల్లిపోతున్నది. గాయపడిన వారిని షియాన్ నగరంలో పలు ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు పూర్తయిన తరువాత మృతుల సంఖ్య మరింతగా పెరగనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.