FbTelugu

24గంటలే గడువు.. సీఎం వార్నింగ్

బోపాల్: తబ్లిగీ జమాత్ కు హాజరై తిరిగి వచ్చి క్వారంటైన్ కు హాజరు కాని వ్యక్తులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. జమాత్ సభ్యులకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇస్తున్నానని.. అయినప్పటికీ రాని పక్షంలో వారిపై క్రిమినల్ కేసులుంటాయని తెలిపారు.

దేశ రాజధానిలోని నిజాముద్దీన్ లో జరిగిన జమాత్ సమావేశానికి వేలాది మంది హాజరై తిరిగి వచ్చారు. కానీ క్వారంటైన్ కు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో.. శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా ఆర్డర్స్ పాస్ చేశారు.

You might also like