FbTelugu

ఎగ్జిట్ పోల్స్ నిషేధం

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, రీ పోలింగ్ ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ ను నిషేధించింది. డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని ఆదేశించింది.

నాలుగో తేదీన ఓట్లను లెక్కిస్తున్నందున ఎగ్జిట్ పోల్ ఫలితాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది. మొత్తం 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో ఓటింగ్ జరగ్గా, ఒక్క డివిజన్ లో వాయిదా వేశారు. ఆ డివిజన్ కు 3వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం కూడా తగ్గింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం రాగా, ఈసారి అంతకన్నా తక్కువగా పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. పలు బూతులు ఓటర్లు రాక వెలవెలబోయాయి. కొన్ని బూతులలో పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం సమయంలో పడుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.