FbTelugu

జూరాల వద్ద మరో లిఫ్ట్ ఇరిగేషన్ కు కసరత్తు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కృష్ణా జలాల వినియోగంపై అధికారలతో సమీక్ష నిర్వహించారు. జూరాల వద్ద మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం జూరాల వద్ద మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కానీ ఇప్పటికే కృష్ణా జలాల అంశంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో జూరాల ప్రాజెక్టు సమీపంలో 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై తెలంగాణ సర్కారు అధికారుల నుంచి నివేదిక కోరింది.

You might also like