FbTelugu

దేశంలో వ్యాక్సిన్ల కొరతకు మోదీనే కారణం: సిరం

ముంబయి: సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల నిల్వలు, డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను ప్రభుత్వం విస్మరించిన కారణంగానే వ్యాక్సిన్ల కొరత ఏర్పాడిందని ఆయన అన్నారు.

వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెంచేటప్పుడు అందుబాటులో ఉన్న నిల్వను, డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రారంభంలో 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, 60 కోట్ల మోతాదు అవసరమని చెప్పారన్నారు. డిమాండ్, సరఫరాకు మధ్య వ్యత్యాసం రావడంతో దేశంలో గందరగోళం నెలకొన్నదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఇష్టానుసారంగా బయట తిరగవద్దని, మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ వాడాల్సిందేనని జాదవ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.