FbTelugu

ఐఏఎస్ రఘుతో సీఎం కుట్ర అమలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సచివాలయంలో భవనాల కూల్చివేతను సీక్రెట్ గా చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మెదక్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి, సీఎం బంధువు మాధవనేని రఘునందన్ రావును పురావస్తు శాఖ అధికారిగా బదిలీ చేసి పని కానిచ్చేశారని ఆయన ఆరోపించారు. సీఎం తన రహస్య ఏజెండాను పక్కాగా అమలు చేశారన్నారు. ఆపరేషన్ జీ బ్లాక్ కు సంబంధించి చాలా ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లారని, ఇదంతా గుప్త నిధులకోసమేనని ఆయన ఆరోపించారు.

మాధవనేని రఘుననందన్ రావును ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్కియాలజీ డైరెక్టర్ గా నియమించారన్నారు. అంతకు ముందు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేశారన్నారు. ఇక అప్పటి నుంచే కేసీఆర్ కుట్రకోణం మొదలుపెట్టారని రేవంత్ విమర్శించారు. సచివాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకుండా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు. యాదగిరి గుట్టలో లేని రహస్యం సచివాలయం విషయంలో ఎందుకు పాటించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కూల్చివేత సమయంలో పురావస్తు శాఖ అధఇకారులు అనుమతి కోరినా ఇవ్వకుండా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు రహస్యంగా చేపట్టారన్నారు.

You might also like